ప్రతిపక్షం, జూలై 15: వరంగల్ మామునూర్ విమానాశ్రయ నిర్మాణాన్ని 2028 జూన్ 2 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే అందమైన టెర్మినల్‌గా మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
టెర్మినల్ రూపకల్పనలో ప్రజలు, వివిధ వర్గాల నుంచి సూచనలు స్వీకరిస్తామని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి సుమారు 1,700 ఎకరాల భూమి అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేస్తే అక్కడ కూడా విమానాశ్రయ నిర్మాణాన్ని చేపడతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

















