ప్రతిపక్షం, జూలై 04, సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ తుకారం గేట్ సర్కిల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదం సంతోష్ కుమార్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఆర్టికల్చర్ మరియు పార్టీ నాయకులతో కలిసి క్యాంటీన్ ప్రారంభించి స్థానిక ప్రజలతో లైన్లో నిలబడి భోజనం తీసుకొని వారితో పాటు భోంచేసి అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం హైదరాబాదుకు ఉపాధి విద్యా ఉద్యోగ అవసరాల కోసం వచ్చే మరియు కార్మికులు విద్యార్థులు ఉద్యోగుల సౌకర్యార్థం 5 ఐదు రూపాయలకే అల్పాహారం మరియు 5 ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అందించడం లక్ష్యంగా ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని సాధారణ ప్రజల జీవనంలో భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం తీసుకున్న మరో ప్రజాహిత చర్య అని కొనియాడారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గంట రాజు సాగర్, ఆదం భరత్, రాజేందర్ యాదవ్ అనిల్ నియోజకవర్గ వివిధ డివిజన్ల అధ్యక్షులు మరియు డివిజన్ సీనియర్ నాయకులు జాఫర్ కొమరమ్మ నాగభూషణం సుదర్శన్ యూసుఫ్, నాయకులు అనంత కృష్ణారావు, సంతోష్ భూపతి హరి మంద సురేష్, గోక రమేష్ రామ లీల, లలిత, వరలక్ష్మి, ప్రీతం, అశ్విన్, గిరి, నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

















