బీఆర్ఎస్ నాయకులు హస్తంలో చేరిక..
ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 24 : కమాన్ పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు బుధవారం కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అధ్యక్షతన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, సయ్యద్ సయీద్ అన్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా.. వారికి రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పిన్రెడ్డి కిషన్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడప కృష్ణమూర్తి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దామెర సంపత్, మాజీ సింగల్ విండో చైర్మన్ సుతారి రాజేందర్, గుండారం గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్, ఆది వరహాస్వామి దేవస్థానం మాజీ డైరెక్టర్ పిడుగు అంజి, మాజీ వార్డు సభ్యులు కాస రవి, అమీర్ ఖాన్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బొల్లెపల్లి లక్ష్మయ్య గౌడ్, ఇరుగురాళ్ల చందర్, నక్క శంకర్, మల్యాల తిరుపతి, కందుల మధు, అంబటి కనకయ్య, పొన్నగంటి రాయనరసు, దాసరి రామస్వామి, గుడిసెల స్వామి, దాసరి రామచందర్, గంధం కృష్ణ, మాదాసు లింగయ్య, కూనమల్ల రాయనారసు, దాసరి రామచందర్, భోగి మహేందర్, కమాన్ పూర్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నీల రాజయ్య, అనవేన లక్ష్మీరాజం, బోనగాని వీరయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇనగంటి బాస్కర్ రావు, సీనియర్ నాయకులు కోలేటి మారుతి, అన్వర్, సయ్యద్, ఇక్బాల్, గాండ్ల మోహన్, మల్యాల తిరుపతి, రంగు సత్యం, ఆకుల ఓడేలు, శిలారపు మల్లయ్య, ఆడపు రమేష్, ముస్తాక్,
మాజీ కో ఆప్షన్ రాఫీక్, తదితరులు ఉన్నారు.