చీటింగ్ పూజారికి VIP మర్యాదలు.. పోలీసుల తీరుపై విమర్శలు!

ప్రతిపక్షం, జూన్ 29: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను రూ.40 లక్షలు మోసం చేసి అమెరికాకు పారిపోయిన పూజారి రామాచార్యులు, అక్కడ మరో ఆలయ హుండీ నుంచి రూ.2.5 కోట్ల నగదును కాజేసిన కేసులో చిక్కుకున్నాడు. బాచుపల్లి పోలీసులు జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసుల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే, నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అతడికి ప్రత్యేక మర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, దీనిపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News