హైదరాబాద్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసన

ప్రతిపక్షం, జూన్ 11: దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థ కోసం జూన్ 14న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ప్రశ్నాపత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ నిరసనలు జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగియనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News