‘మోదీ భయపడ్డారు’.. ప్రధాని ప్రకటనపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు వైరల్

ప్రతిపక్షం, జూలై 24: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

డర్ గయా.. యువత శక్తిని చూసి భయం పట్టుకుంది. అది స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలు అధికార పక్షంపై ఒత్తిడి తీసుకొచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ యువత ఉద్యమం ప్రభావం చూపిందని అంటుండగా, మరికొందరు ప్రధాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు వరుసగా స్పందిస్తుండటంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Spread the love

Related News

Latest News