నీట్ లీకేజీపై ప్రధాని మోదీ కీలక ప్రకటన.. కఠిన చర్యలకు సంకేతం

ప్రతిపక్షం, జూలై 24: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా అభివర్ణించిన ఆయన, దీని వెనుక ఎవరున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తిరిగి పరీక్ష నిర్వహించామని తెలిపారు.

శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు మరిన్ని సంస్కరణలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే పేపర్ లీకేజీ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.

అదేవిధంగా, పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు మరింత కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొచ్చే ఉద్దేశంతో సోమవారం పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడతామని ప్రధాని మోదీ వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News