ప్రతిపక్షం, జూలై 23: చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. శాసనసభ ప్రాంగణాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


















