ప్రతిపక్షం, జూలై 05: హిమాలయ పర్వతాల అద్భుత సౌందర్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన పక్షి హిమాలయ మోనాల్ మరోసారి ప్రకృతి ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంద్రధనుస్సు రంగులను తలపించే మెరిసే ఈకలతో కనిపించే మగ మోనాల్ తన అపూర్వ అందంతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఫెసెంట్ జాతికి చెందిన ఈ పక్షి నేపాల్ జాతీయ పక్షిగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందింది. హిమాలయాల ఎత్తైన అడవులు, గడ్డి మైదానాల్లో నివసించే ఈ అరుదైన పక్షి ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవల భారతీయ ఫొటోగ్రాఫర్ కెమెరాలో హిమాలయ మోనాల్ అందాలు బంధించబడటంతో ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

















