[t4b-ticker]

స్పూర్తిదాయకంగా నిలుస్తున్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నిర్ణయాలు.

బెల్ట్ షాపులు వద్దు – బంగారు పల్లెలు ముద్దు

మునుగోడును చూసి మేలుకుంటున్న పక్క నియోజకవర్గాలు.

బెల్ట్ షాపుల నిర్మూలన దిశగా కదులుతున్న పల్లెలు

బెల్ట్ షాపులను అరికట్టాలని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్న పంచాయతీలు.

మునుగోడు మోడల్ కు రాష్ట్రవ్యాప్త గుర్తింపు – బెల్ట్ షాపుల నిర్మూలనలో రాజ్ గోపాల్ రెడ్డి లీడ్.

ప్రతి పక్షం మునుగోడు ఆగస్టు 19: మునుగోడు శాసనసబ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ నియోజవకవర్గంలో అమలుపరుస్తున్న తీరును స్పూర్తిని ఇతర నియోజవకర్గ పల్లెలు కూడా అమలులోకి తీసుకొస్తున్నాయి..ఇప్పటికే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపుల నిర్మూలన కార్యక్రమం చాలా కఠినంగా అమలవుతోంది..బెల్ట్ షాపులు లేకపోవడంతో మునుగోడు నియోజకవర్గ గ్రామాలలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంది క్రైమ్ రేట్ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.

రాజ్ గోపాల్ రెడ్డి స్పూర్తితో ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం తాళ్ల వెల్లెంల, ఏపూర్, పెద్దకాపర్తి, పేరేపల్లి గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలనకు పంచాయతీలు తీర్మానాలు చేసి అమలుపరుస్తుండగా నల్గొండ నియోజకవర్గంలోని కనగల్ మండల కేంద్ర గ్రామపంచాయతీ కూడా బెల్ట్ షాపుల నిర్మూలకు తీర్మానం చేసింది..కనగల్ మండల కేంద్రంలో బెల్ట్ షాపులు నిర్వహించకూడదని ఒకవేళ తీర్మానాన్ని ఉల్లంఘిస్తే 50 వేల జరిమానా విదిస్తామంటూ తీర్మానంలో పేర్కొన్నారు.

ప్రతి పక్ష ఎమ్మెల్యే గా ఉన్నపుడే బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం.

2018 లో ఎమ్మెల్యేగా గెలిచినపుడే రాజ్ గోపాల్ రెడ్డి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్మూలించాలని పిలుపునిచ్చారు. నిర్మూలించిన గ్రామాలకు అబివ్రుద్ది నిదులను ఇస్తానని మాటిచ్చారు. నారాయణ్ పూర్ మండలం అల్లందేవిచెరువు టీఆర్ఎస్ సర్పంచి బెల్ట్ షాపులను నిర్మూలిస్తే తన మాత్రుమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద 6 లక్షల రూపాయలు అభివ్రుద్దికి నిదులు ఇచ్చార. అపుడు ప్రతిపక్షంలో ఉండడం వల్ల రాజ్ గోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అమలుకాలేకపోయాయి. 2023 లో తిరిగి ఎమ్మెల్యే గా గెలవడం ప్రజాప్రభుత్వం అదికారంలోకి రావడంతో తన నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చాడు.అమలు ఫలితంగా మునుగోడు నియోజకవర్గ గ్రామాలలో వస్తున్న ఫలితాలతో పక్క నియోజకవర్గ పల్లెల్లోని ప్రజలు కూడా బెల్ట్ షాపులను మూసివేసే దిశగా ముందుకుసాగుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి స్పూర్తిగా తీసుకొని పల్లెలు బెల్ట్ షాపుల నిర్మూలనకు శ్రీకారం చుడుతున్నాయి.

Spread the love

Related News

Latest News