నేడు బేగంపేటలో కేటీఆర్ పర్యటన

ప్రతిపక్షం, జూన్ 18: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10.30 గంటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి రామానంద తీర్థ మెమోరియల్ పాఠశాలను సందర్శించనున్నారు.

పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, పాఠశాల సౌకర్యాలపై ఆరా తీసే అవకాశం ఉంది.

ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, విద్యాసంస్థ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Spread the love

Related News