లోక్‌సభలో రెండొంతుల మెజార్టీ లక్ష్యం.. కూటమి బలోపేతంపై అధికార పక్షం దృష్టి

ప్రతిపక్షం, జూన్ 18: లోక్‌సభలో రెండొంతుల మెజార్టీ సాధించడంపై అధికార కూటమి దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలక బిల్లుల ఆమోదంలో ఎదురైన సవాళ్ల నేపథ్యంలో పార్లమెంట్‌లో తమ బలాన్ని మరింత పెంచుకునే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష ఎంపీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా తూర్పు భారతదేశం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని కొందరు ఎంపీలు అధికార కూటమి వైపు మొగ్గు చూపుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాజకీయ పరిణామాలు ఎలా మారతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News