హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో స్కీమ్ అమలుకుప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా ప్రారంభించారు. ఈ క్రమంలో రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. పథకం అమలు ఎలా చేస్తారు..? ఎవరు ఈ పథకానికి అర్హులు..? వంటి కీలక వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్‌కి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది.
- సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంది.
- సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు.
- ఈ పథకానికి అర్హులుగా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
- మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని.. దాని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్స్ కేటాయిస్తారు.
- వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకోవాలి.
- ఆ తరువాత వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు.
- గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం నేరుగా గ్యాస్ సంస్థలకు ఇవ్వనుంది. సంస్థల నుంచి వినియోగదారులకు నగదు చెల్లింపు చేస్తారు.
- జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని మానిటరింగ్ చేయనుంది ప్రభుత్వం.
- భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.
- 48 గంటల్లోనే వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లోని సబ్సిడీ డబ్బులు బదిలీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు.