ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ.. కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.