Trending Now

భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్..?

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: భారత జట్టు ప్రధాన కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ భారత కోచ్ పాత్రపై ఇవాళ బీసీసీఐ, గౌతమ్ గంభీర్ తో చర్చలు జరిగినట్లు క్రిక్ బజ్ తెలిపింది. ఈ అంశంపై T20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు దీనిపై బీసీసీఐ అధికార ప్రకటన చేస్తుందని సమాచారం.

ప్రధాన కోచ్‌గా గంభీర్‌ కంటే ధోనీ బెటర్..

భారత్ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకొనేందుకు సోమవారంతో గడువు ముగిసింది. ఎవరు దరఖాస్తు చేశారు? ఎవరివి చెల్లుబాటు అయ్యాయనే విషయాలను బీసీసీఐ వెల్లడించలేదు. ఈ రేసులో గౌతమ్ గంభీర్‌ ముందున్నాడనేది క్రికెట్ విశ్లేషకుల మాట. అయితే, విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ధోనీ పేరును తెరమీదకు తెచ్చాడు. ఎంఎస్ ధోనీని ప్రధాన కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు.

Spread the love

Related News