ప్రతిపక్షం, రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మే 01 : సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలలో కబడ్డీ, వాలీబాల్, అర్చరీ, యోగ, క్రికెట్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ మొదలగు క్రీడలతో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై, పోలీస్ శాఖలో అమలుపరుస్తున్న మొదలగు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు ముఖ్యమే అని క్రీడల వలన పిల్లలలో మానాసికొల్లాసం కలుగుతుందని, యువతను క్రీడల వైపు ప్రోత్సాహించేందుకు, చెడు మార్గాల వైపు దారిమల్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట్, కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటుగా ఒత్తిడి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని, క్రీడలు ఎవరి జీవితంలో వారికి తీపి గుర్తుగా మిగిలిపోతాయని, క్రీడాకారులు ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని ఎస్పీ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ లు రఘుపతి, సదన్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, వివిధ క్రీడల కోచ్‌లు పాల్గొన్నారు.