Trending Now

‘ఒన్ టైమ్ సర్వీస్’ ను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్ రోనాల్డ్ రోస్

హైదరాబాద్, మార్చి 27, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఆస్తిపన్ను బకాయిదారులకు ప్రభుత్వం అందిస్తున్న వన్​టైమ్​సర్వీసెస్​వెసులుబాటును సద్వినియోగం చేసుకొని, అపరాద రుసుం నుంచి విముక్తి చేసుకోవాలని జీహెచ్​ఎంసీ కమీషనర్​ రోనాల్డ్​రోస్​ కోరారు. వన్ టైమ్ సర్వీస్ ద్వారా కూకట్ పల్లి ఐడిపిఎల్ కంపెనీ బకాయి ఉన్న రూ.16 కోట్ల రూపాయలను చెక్కు రూపేణ కమిషనర్ కు కంపెనీ ప్రతినిధులు బుధవారం అందజేశారు. ఓటిఎస్ ద్వారా ఐడిపిఎల్ సంస్థ బకాయిలు చెల్లించినందుకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ప్రభుత్వ కంపెనీలు, కార్యాలయాలు, ఆస్తిపన్ను బకాయిదారులు (వన్ టైమ్ సర్వీస్ ) ద్వారా బకాయిలు మార్చి31 వరకు చెల్లించి వడ్డీ పై 90 శాతం రాయితి పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని 2023-24 సంవత్సరం లో ఇంటి పన్ను బకాయిలను కూడా చెల్లించవచ్చునని కమిషనర్ కోరారు.

Spread the love