Trending Now

త్వరలోనే అన్ని అంగన్​వాడీ కేంద్రాలకు సొంత భవనాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్​, స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు కొనసాగిస్తున్న అంగన్​వాడీ కేంద్రాలలో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్​ హాజరు విధానాన్ని అమలు చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్​రెడ్డి స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో స్త్రీ,శిశు సంక్షేమంపై ఉన్నతస్థాయి సమీక్షించారు. ఈ సమావేశానికి రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం, పంచాయితీరాజ్​శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు స్త్రీ,శిశు సంక్షేమశాఖ కమీషనర్​ తదితర అధికారులు పాల్గొన్నారు. అంగన్​వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందాలని, అందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన సరుకులు ఎప్పటికప్పుడు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ కేంద్రాల ద్వారా పౌష్టికాహారలోపాన్ని నివారించేందుకు అందజేస్తున్న పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలని, అందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. సొంత భవనాల కల్పన మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని, యుద్దప్రాతిపదికన భవన నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్​ అధికారులను ఆదేశించారు.

Spread the love