Trending Now

తెలంగాణ ఆదర్శ పాఠశాల ఇర్కోడ్‌లో స్పాట్ అడ్మిషన్లు..

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 28: తెలంగాణ ఆదర్శ పాఠశాల ఇర్కోడ్‌లో 6,7,8,9,10 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకు గాను 29వ తేదీ శనివారం రోజున స్పాట్ అడ్మిషన్లను నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ సామలేటి బుచ్చిబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి అర్హత కలిగిన విద్యార్థులు నేరుగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని, అదేవిధంగా వారి తర్వాత మిగతా విద్యార్థులకు సీట్లు కల్పిస్తామని తెలియజేశారు. పూర్తి వివరాలకు తెలంగాణ ఆదర్శ పాఠశాల ఇర్కోడ్‌లో సంప్రదించగలరని తెలిపారు. చివరి అవకాశంగా ఈనెల 29 శనివారం రోజున స్పాట్ అడ్మిషన్లను నిర్వహించడం జరుగుతుందని తదుపరి అడ్మిషన్లని ముగిస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ సామలేటీ బుచ్చిబాబు తెలిపారు.

Spread the love

Related News

Latest News