ప్రతిపక్షం, జూన్ 17: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధానానికి సంబంధించిన కొత్త జీవోలు (జీవో 8, 9) అమలుతో పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి పాత బకాయిలు ఇంకా విడుదల కాకపోవడంతో, అడ్వాన్స్ ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని ప్రైవేట్ కళాశాలలు స్పష్టం చేస్తున్నట్లు సమాచారం.
దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం, కళాశాలల కఠిన వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని పేర్కొంటున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థుల అడ్మిషన్లకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

















