Trending Now

‘స్కూల్ సీజ్ చేయండి’.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కూల్ ఎదుట ధర్నా

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 28: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని మడ్యూలస్ స్కూల్ సీజ్ చేయాలని స్కూల్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ.. పర్మిషన్ లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్న పరిస్థితి ఉన్నదని ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నారని అన్నారు. విద్యాసంస్థలు ప్రారంభమై 20 రోజులు అవుతున్న కూడా స్కూల్ పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేయడం సిగ్గుచేటని విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరం అని అన్నారు.

విచ్చలా విడిగా మోడ్యూలస్ వ్యాపారస్తులకు యూనిఫామ్ పుస్తకాలు ఇచ్చి అమ్మిస్తున్న పరిస్థితి ఉన్నదని వారు తెలిపారు. 20 రోజులుగా నడుస్తా ఉన్న విద్యాశాఖ అధికారులు స్కూల్ ను సోదాలు చేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. విద్యాశాఖ అధికారుల పనితీరు పట్టింపు లేనట్టు గా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోడ్యూలస్ స్కూల్ సీజ్ చేయకపోతే పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదలా రంజిత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొండం సంజీవ్ కుమార్, నాయకులు తాడూరి భరత్ కుమార్, బత్తుల అభి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News