ప్రతిపక్షం, తెలంగాణ: సంగారెడ్డి జిల్లా లోని జహీరాబాద్ లో ఇవాళ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించారు. జహీరాబాద్ మున్సిపాలిటీ లో చేపట్టుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.