Trending Now

అయ్యా ఏడీ గారూ.. జర కనిపించు..!

నిర్మల్ వ్యవసాయ శాఖ ఏడీ చాంబర్ దుస్థితీది..

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లా కేంద్రం లోని వ్యవసాయ శాఖ కార్యాలయం లో ఉన్న వ్యవసాయ శాఖ ఏడీ వినయ్ బాబు చాంబర్ దుస్థితి ఇది. తన వ్యక్తిగత చాంబర్ లో ప్రధాన బల్లపై పనికిరాని.. పనికివచ్చే కాగితాలు తాను కూర్చునే ప్రదేశం కంటే ఎత్తులో ఉంచుకొని ఎదురు కూర్చున్న వారు కనిపించకుండా ధూళి, దుమ్మాతో నెలల తరబడి నిండి ఉన్న కాగితాలను తీసివేయకుండా అలాగే విధులు నిర్వహిస్తున్నారు.

తన చాంబర్ లోనే కాకుండా కార్యాలయంలో కూడా కనీస శుభ్రతను పాటించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏడీ తీరుపై కార్యాలయానికి వచ్చి పోయే వ్యవసాయదారులు, సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది ఆగమ్య గోచరులవుతున్నారు. ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఎవరైనా వచ్చి అయ్యగారి చాంబర్ లో ఎదురుగా కూర్చుండి ఫేస్ టు ఫేస్ గా మాట్లాడుకుందామన్న అడ్డుగా ఏపుగా ఉంచిన పనికిరాని.. పనికివచ్చే కాగితాలు దుమ్మా.. దూళి మధ్యనే ఉండి మాట్లాడవలసి వస్తుంది. నిర్మల్ ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి ఈ దృశ్యాన్ని తన కెమెరలో బంధించాడిలా..!

Spread the love

Related News

Latest News