ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఒలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్‌ను తీసుకుంది.
మరోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మార్పులు చేశాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టిన రజత్ పటీదార్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 63 పరుగులే చేశాడు. దీంతో చివరి టెస్టుకు అతని స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను తీసుకున్నారు. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆర్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోకు ఇది వందో టెస్టు మ్యాచ్.
🚨 Toss Update 🚨
— BCCI (@BCCI) March 7, 2024
England elect to bat in Dharamsala.
Follow the match ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/v9Pz5RMPX5