Trending Now

కాంగ్రెస్‌లో చేరిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన శంకరమ్మ బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు శంకరమ్మ. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. శంకరమ్మ గారు నా మీద పోటీ చేశారు. అయిన మేము ఎప్పుడు వ్యక్తిగత వైరాలకు వెళ్ళలేదు.

హుజూర్ నగర్ లో బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యింది.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు జనాలను మోసం చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నాయన్నారు. తెలంగాణ కు బీజేపీ చేసింది ఏమి లేదు. మోడీ తెలంగాణ కు ఏమి చేసారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రిజర్వేషన్ల రద్దు మీద బీజేపీ వాళ్ళు చాలా సార్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై బీజేపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మేము మా ప్రభుత్వ పెద్దలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతున్నాము.. రాష్ట్రం లో ఒక్క నిమిషం కూడా కరెంట్ ఎక్కడ పోవడం లేదు. గతం కంటే ఇప్పుడు నాణ్యమైన కరెంట్ అందిస్తున్నామని స్పష్టంచేశారు. ఇప్పటికే 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసాము. కొనుగోలు సెంటర్ లో దగ్గర తడిసిన ధాన్యం ను కొనుగోలు చేస్తామన్నారు. ఎన్నికలు కాగానే అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని.. అర్హులైన వారికి ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. మెజార్టీ సీట్లు మేము గెలుస్తున్నాము.. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు. మేము 13 మేము సీట్లు గెలుస్తున్నాము.. 3 సీట్ల లో బీజేపీ తో పోటీ ఉంది.. ఒకటి mim తో పోటీ ఉందని పేర్కొన్నారు.

Spread the love

Related News