Trending Now

55 రోజుల తర్వాత “సందేశ్ ఖాలీ” నిందితుడు అరెస్టు

ప్రతిపక్షం, నేషనల్: 55 రోజుల తర్వాత సందేశ్ ఖాలీ కేసులో నిందితుడు అరెస్టయ్యాడు. సందేశ్‌ఖాలీలో మహిళలపై వేధింపులు, భూ కబ్జాల్లో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను అరెస్టు చేసినట్లు బెంగాల్ పోలీసులు ప్రకటించారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని మినాఖాలోని ఓ ఇంటిలో షాజహాన్ తలదాచుకున్నట్లు తెలిపారు. తర్వాత బసిర్హత్ కోర్టుకి తీసుకెళ్లినట్లు తెలిపారు. సందేశ్‌ఖాలీ కేసులో షేక్ షాజహాన్‌ను అరెస్టు చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశించిన మూడు రోజుల్లోనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

రేషన్ కుంభకోణం కేసులో షాజహాన్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం వెళ్లింది. కాగా.. అక్కడికి వెళ్లిన ఈడీ బృందంపై సామూహిక దాడి జరిగింది. దీంతో అప్పట్నుంచి షాజహాన్ కనిపించకుండా పోయారు. జనవరి 5 నుంచి షాజహాన్ అజ్ఞాతంలోకి పోయాడు. దాదాపు 55 రోజులకు పైగా పరారీలో షాజహాన్ ను అరెస్టు చేశారు బెంగాల్ పోలీసులు.

Spread the love