ప్రతిపక్షం, జూన్ 13: ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన హృదయ విదారకమని టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను పరామర్శించిన ఆమె, చిన్నారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, కేసును వెనక్కి తీసుకోవాలని బాధిత కుటుంబంపై ఒత్తిడి తెస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. బాధిత కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు, బాలికకు నెలకు రూ.50 వేల పెన్షన్ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అలాగే బాధిత కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి, వారి భవిష్యత్తుకు అవసరమైన అన్ని విధాలా అండగా నిలవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సమాజం మొత్తం స్పందించి చిన్నారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

















