Trending Now

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ పరిశీలన..

ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 30: లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం 06- మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి (ఐఏఎస్) సిద్దిపేట పట్టణంలోని పొన్నాల శివారులో గల ఇందూరు కళశాలలో ఏర్పాటు చేసిన సిద్దిపేట నియోజకవర్గ ఈవీఎం స్ట్రాంగ్ రూం ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. మను చౌదరి తో కలిసి క్షేత్ర స్థాయిలో పరీశిలించారు. ముందుగా జిల్లా ఎన్నికల అధికారి సాధారణ పరిశీలకునికి పూల మొక్కను ఇస్తూ.. మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాలు ప్రకారం రిజిస్టర్, లాగ్ బుక్, ఇతర రికార్డుల మెయింటెనెన్స్ చెయ్యాలని, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. 24/7 పటిష్ట బందోబస్తు విధులు నిర్వహించాలని కేంద్ర బలగ పోలీస్ అధికారులకు తెలిపారు. అనంతరం అసెంబ్లీ స్థాయి శిక్షణ అందించేందుకు ఉపయోగించే ఈవిఎం మీషన్ల స్రాంగ్ రుం, కమీషనింగ్ రూం లను పరీశిలించారు. సిద్దిపేట ఎఆర్ఓ, ఆర్డీఓ సదానందం కు ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం.. పూర్తి ఎన్నికల ప్రక్రియ నిర్వహణ జరగాలని సూచించారు.

Spread the love

Related News