ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అఫ్గాన్ తరపున రెండు టెస్టులు, 51 వన్డేలు, 22 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 1,919 పరుగులు చేశాడు.