Trending Now

భారత ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది..

బీజేపీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు

ప్రతిపక్షం, దుబ్బాక, మే 13: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువైనది అని బీజేపీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. సోమవారం అక్బర్ పేట భుంపల్లి మండల పరిధిలోని ఆయన సొంత గ్రామం బొప్పాపుర్ గ్రామములో ఆయన కుటుంబ సభ్యుల తో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని.. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఓట్ల శాతం 97 శాతం వరకు పోల్ అవుతుందన్నారు. కానీ అదే తరహాలో పట్టణాలు, నగరాలలో ఓట్ల శాతం తక్కువగా పోల్ అవడం దురదృష్టకరమన్నారు. కాబట్టి పట్టణాలు, నగరాలలో నివసించే ప్రజలు, యువకులు ఓటు హక్కుపై దృష్టి సారించి తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.

Spread the love

Related News