ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తాడని సంచలన ప్రకటన చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజెందర్, మల్లారెడ్డి కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు. తప్పక విజయం సాధిస్తారని దీవించారు. మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు.. నువ్వే గెలుస్తున్నవ్ అంటూ ఈటలను గట్టిగా హత్తుకున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజిగిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలుస్తారని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.