Trending Now

మెదక్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా..

పనిచేసే వెంకట్రామరెడ్డికి పట్టం కట్టాలి..

ప్రతి పక్షం, దుబ్బాక ( చేగుంట) ఏప్రిల్ 16: దుబ్బాక ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరేపలాడటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చేగుంట మండలంలోని వడియారంలో జరిగిన చేగుంట, నార్సింగి మండలాల పార్టీ కార్యకర్తలసమావేశంలో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి తో కలిసి మాట్లాడారు. అబద్దాలు చెప్పి మోసం చేసిన రఘునందన్ కు ఓటమి భయం పట్టుకుందని, భయంతోనే వెంకట్రామరెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు.

ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక వెంకట్రామరెడ్డి ని అరెస్టు చేయాలని, కేసులు పెట్టాలని మాట్లాడుతున్నారని, దుబ్బాక ప్రజలను మోసం చేసిన నీపై కేసులు పెట్టాలన్నారు. అక్రమాలకు పాల్పడే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలన్నారు. పార్టీ లు మారితే ఒరిగేదేమీ లేదని, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి కేసీఆర్ మంచి గౌరవం ఇచ్చారని, నేడు పార్టీ మారితే అతనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూశారాన్నారు. ఎంపీ గా మెదక్ పార్లమెంటు కోసం ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఫ్లై ఓవర్లు, అండర్ పాసింగ్ నిర్మాణాలు, జాతీయ రహదారి అభివృద్ధి, సిద్దిపేట, మెదక్ లకు రైలు సౌకర్యం, సిద్దిపేట కు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగిందన్నారు.

420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ ద్వారా సాగునీళ్లు తెచ్చుకున్నామని , తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమైందని తిన్నదగ్గర రేవు తలవాలన్నారు. సిద్దిపేట అభివృద్ధి లో కలెక్టర్ గా వెంకట్రామరెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఎంపీ గా గెలిపించి పార్లమెంటు కు పంపిద్దామన్నారు. దుబ్బాక అభివృద్ధి లో వెంకట్రామరెడ్డి కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు. 100 కోట్లతో ఏర్పాటు చేసే ట్రస్టు ద్వారా యువతీ, యువకులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు.

అంతకు ముందు ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి. వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో గెలిచే సత్తా లేకనే నాపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ గా నా పనితీరు ప్రజలకు తెలుసని, ఓర్వలేని రఘునందన్ కేంద్రంలో వారి ప్రభుత్వం ఉంది అనే ఉద్దేశ్యంతో నామీద కేసులు పెడుతున్నారన్నారు. రఘునందన్ నామీద కలెక్టర్ కు, ఎస్పీ కి, ఈడీ, సీబీఐ, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసారని, ఇంకా ఏమైనా చేసుకో, తెల్ల పేపర్ లాంటి నేను భయపడేది లేదన్నారు. మాయ మాటలు చెప్పే వాళ్ళను దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నమ్మబోరని, వాస్తవాలు చెప్పే వారికే పట్టం కట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మనోహర రావు, రొట్టె రాజమౌళి పంతులు, సోలిపేట సతీష్ రెడ్డి, వెంకట నర్సింహ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నారాయణరెడ్డి, మైలారం బాబు, జడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్, బాణపురం కృష్ణా రెడ్డి, ఎంపీపీ చిందం సబిత, వైస్ ఎంపీపీ సుజాత, జడ్పీ కో అప్షన్ సభ్యుడు ఎండీ రహీమోద్దీన్, స్థానిక మాజీ సర్పంచ్ తిరుమల శ్రీనివాస్, మండల సర్పంచ్ ల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, రైతు బంధు జిల్లా డైరెక్టర్ మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ లు కొండల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, రాజగోపాల్, సుభాష్ రెడ్డి, శ్రీ పతి రావు, వెణుపంతులు, సుభాశ్ రెడ్డి పట్నం తానీషా తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News