జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యంగా.. డిసెంబర్ 1న TUWJ-IJU జిల్లా 3వ మహాసభలు!

*భైంసా లో మహాసభల పోస్టర్ ఆవిష్కరణ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపు*

ప్రతిపక్షం, నవంబర్ 28, నిర్మల్ జిల్లా: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, ఐక్యతే లక్ష్యంగా TUWJ-IJU నిర్మల్ జిల్లా 3వ మహాసభలను డిసెంబర్ 1న నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు.ఈ నేపథ్యంలో శుక్రవారం భైంసా పట్టణంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. డిసెంబర్ 1న నిర్మల్ పట్టణంలోని ఆర్య కన్వెన్షన్ హాల్‌లో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన, వృత్తిపరమైన భద్రతతో పాటు జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయడమే మహాసభల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులు,విలేకరులు పెద్ద సంఖ్యలో మహాసభలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సోమ ప్రమోద్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News