*మేస్త్రి కూతురు ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిన చదువు – మంత్రిని కలిసిన విద్యార్థిని
*ఎంబీబీఎస్ మిగతా 3 ఏళ్ల ఫీజు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చెల్లింపు.
*దశాబ్ద కాలంగా పేద విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న మంత్రి.
*ఉన్నత చదువులకు పేదరికం ఎప్పటికీ అడ్డుకాకూడదు : మంత్రి వెంకటరెడ్డి
ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 18 : నల్లగొండ జిల్లా మోత్కూరు మండలానికి చెందిన ఏ. రజిని అనే విద్యార్థిని ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తదుపరి చదువు ముందుకు సాగని పరిస్థితుల్లో ఉన్న రజిని, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని కలిసి తన కుటుంబ పరిస్థితిని వివరించారు.ఆమె పరిస్థితిని విన్న మంత్రి వెంటనే స్పందిస్తూ, ఉన్నత చదువులకు పేదరికం ఎప్పటికీ అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. రజిని ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి అవసరమయ్యే మిగతా మూడేళ్ల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా చెల్లిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.
గత దశాబ్ద కాలంగా ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలిచి, వారిని డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవా దృక్పథం ఎందరికో ఆదర్శనీయం. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆయన చూపుతున్న దార్శనికత నిజంగా అభినందనీయం.






























