సిద్ధిపేటకు సిద్ధం కావాలి.. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలి రావాలి

  • కాంగ్రెస్ నాయకుల పిలుపు

ప్రతిపక్షం, నంగునూరు, నవంబర్ 15: ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) వైస్ ఛైర్మన్, సిద్ధిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాదుల పవన్ కుమార్, సీనియర్ నాయకుడు రాపోలు రాజ బహదూర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రంగు అశోక్, ఏఎంసీ డైరెక్టర్లు ఎండీ ఇమ్రాన్, గొట్టం రంగారెడ్డి, తిప్పని రాజేశ్వర్, జీవన్ నాయక్, ప్రభాకర్, చేర్యాల కృష్ణ, పీఏసీఎస్ డైరెక్టర్ కరెడ్ల వెంకట్ రెడ్డి, కాటం కనకయ్య, గడ్డం కరుణాకర్ రెడ్డి, పదిరె శ్యామ్ రెడ్డి, పిల్లి మహేశ్, బర్రె సంతోష్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బోజ రాములు, నాయిని సంపత్ రెడ్డి, మాదె మహేశ్ తదితరులు ఆదివారం నంగునూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నంగునూరు మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలి రావాలని కోరారు.

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్ధిపేటలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఈ సభకు నంగునూరు మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సభ విజయవంతం కావడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి ఛలో సిద్ధిపేట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News