ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 13 : జిల్లా కలెక్టరేట్ లో గల కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ సరళిని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. జిల్లాలో మొత్తం తొమ్మిది వందల ఇరవై ఆరు పోలీస్ స్టేషన్లో ఉండగా.. ఆయా ప్రాంతాలలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో ఉన్న పోలింగ్ స్టేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 7,34,416 మంది ఓటర్లు ఉండగా సోమవారం ఉదయం నుంచే పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లోకి చేరుకొని తమ ఓటు హక్కును సద్వినియోగపరుచుకుంటున్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్నవారు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమకున్న సౌకర్యాల ఆధారంగా నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గం.ల వరకు 53 శాతం పోలింగ్ నమోదు అయినట్లు నిర్ధారించారు.