జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీఓ శ్రీదేవి.
ప్రతి పక్షం చండూరు ఆగస్టు 15: చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చండూరు ఆర్డీఓ కార్యాలయంలో వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ, డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీదేవి గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని అందరూ కలిసి ఆలపించారు. ఆర్డీఓ శ్రీదేవి గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో విధినిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ఆర్డీఓ శ్రీదేవి గారు సత్కరించారు .
*కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఆర్డీవో శ్రీదేవి.
చండూరు ఆర్డీవో వి. శ్రీదేవి ప్రతిభను గుర్తించి జిల్లాధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రభుత్వ సేవల నిర్వహణలో, పాలనా పరమైన బాధ్యతల్లో మరియు ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించింది. ఆర్డీఓ శ్రీదేవి గారు విధులను సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు. చండూరు ఆర్డీవో వి. శ్రీదేవి ప్రతిభను గుర్తించి జిల్లాధికారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ప్రభుత్వ సేవల నిర్వహణలో, పాలనా పరమైన బాధ్యతల్లో మరియు ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించింది. పాఠశాల విద్యార్థులకు బహుమతులు కూడా అందజేశారు. ఈ వేడుకల్లో ఆర్డీఓ కార్యాలయ, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






























