కస్తాల బీసీ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా భూమిపూజ

ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 01: చండూరు మండలం కస్తాల గ్రామంలోని బీసీ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు గురువారం భూమిపూజ (కర్ర పూజ) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ప్రతి ఏటా దసరా పండుగను పురస్కరించుకుని బీసీ కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు గాను గురువారం కాలనీ పెద్దలు, యువకులు, భక్తులు కలిసి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా కాలనీలోని దుర్గామాత మండపం వద్ద కర్ర పాతి, పసుపు కుంకుమలు, పూలు, కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని భక్తులు మొక్కుకున్నారు.

నిర్వాహకులు మాట్లాడుతూ… ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను గతంలో కంటే మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు, భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News