కూలీలకు నిరంతర ఉపాధి, గ్రామాల్లో ఆస్తుల సృష్టి, మార్చి నాటికి 100, శాతం పన్నుల వసూళ్లు పూర్తి చేయాలి.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) అక్టోబర్, 30: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతో పాటు జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికీ నిరంతరం ఉపాధి కల్పించాలని, గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత గ్రామ, మండల స్థాయి అధికారులతో పెగడపల్లి, మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదేశించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ రాబోయే 2027, జూన్, జూలై నెలల వరకు ఉపాధి హామీ పనుల నిర్వ హణకు అత్యధిక ప్రాధా న్యత ఇవ్వాలని, కూలీలకు నిరంతర ఉపాధి కల్పించేం దుకు అదనపు పనులను గుర్తించి తగినన్నిఅంచనాలు రూపొందించి ముందస్తుగా అనుమతులు, మంజూరు లు పొందాలని సూచించా రు. ఉపాధి హామీ పథకం కింద సోక్ పిట్స్, ఫామ్ పాండ్స్, నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం తదితర పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో జాబ్ కార్డుదారుల సంఖ్య, కూలీల అవసరాలు, అందు బాటులో ఉన్న పనులను గుర్తించి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు.
గ్రామపంచాయతీలు, మండలాల వారీగా ఉపాధి హామీ పనుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని, కూలీల హాజరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికా రులను సూచించారు. లక్ష్యా ల సాధనలో వెనుకబడిన గ్రామాలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పను ల పురోగతిని మెరుగు పర చాలని స్పష్టం చేశారు. నిర్దే శిత లక్ష్యాలను సాధించడం లో నిర్లక్ష్యం వహించే అధికా రులపై చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల ఆదాయ వన రులను పెంపొందించేందుకు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, వచ్చే మార్చి నెల నాటికి నూటికి నూరు శాతం పన్నుల వసూళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని మండ లాల్లో పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపో వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రతి గ్రామపంచా యతీ నిర్దేశిత లక్ష్యాన్ని చేరు కోవాలని సూచించారు. పన్నుల వసూళ్ల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్,లో నమోదు చేయాలని, ఆన్లైన్,లో నమోదైన రికార్డులనే ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుంటా మని స్పష్టం చేశారు.
పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఎం.పీ.డీ.వో.లు, ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉపాధి హామీ పనుల పురోగతి, గ్రామాల్లో ఆస్తుల సృష్టి, పన్నుల వసూళ్ల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే పంచా యతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమా వేశంలో జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డీఆర్డీఓ రఘువరన్, ఆర్డీఓ మధుసూదన్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.































