*రాహుల్, ప్రియాంక, ఖర్గే అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన.
*చండూరు చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం.
*బిజెపి ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని ఓట్ల చోరీకి పాల్పడుతోంది.
*చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి.
ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 08 : దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓట్ చోరీకి పాల్పడుతున్న ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ నాయకురాలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు మేరకు చండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చండూరు చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చండూరు మండల పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, చండూరు మున్సిపాలిటీ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కార్యకర్తలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గేలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, బీజేపీ అరాచకాలను ప్రజల్లో ఎండగడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ లింగస్వామి, మహిళా అధ్యక్షురాలు పందిరి రాధా, నాయకురాళ్లు కారింగు పల్లవి, రమాదేవి, జిల్లా నాయకులు ఇరిగి రాజు, కసాల జనార్దన్ రెడ్డి, కోడి వెంకన్న, కారింగు రామ్మూర్తి, పన్నాల లింగయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు గండూరి వెంకట్ గౌడ్, సుజావుద్దీన్, మాజీ ఎంపీటీసీ నేర్లకంటి రవి, సర్పంచులు కావాలి సురేష్, బొమ్మల శేఖర్, ముక్కముల వెంకన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు గంటేకంపు అశోక్, నాగరాజు, మండల ఉపాధ్యక్షులు గంట తులసయ్య, ప్రధాన కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





























