వేద మంత్రోచ్ఛారణలు.. భక్తుల జయజయధ్వానాలు
ప్రతిపక్షం మెదక్ ప్రతినిధి అక్టోబర్ 15: పట్టణంలోని కుమ్మరిగడ్డ అనాది హనుమాన్ దేవాలయంలో శ్రీ సంతోషిమాత ఆలయ 41వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.ఈ సందర్భంగా సంతోషిమాతకు అభిషేకం, దుర్గామాతకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం చండీ హవనం, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. భవానీమాత మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అరునార్తి వెంకటరమణ, భట్టి ఉదయ్, రా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేశం, వేద పండితులు భరత్ శర్మ, వైద్య రాజు, వైద్య శ్రీనివాస్, మధుసూదన్, దోర్భల రాజమౌళి, ప్రసాద్, సాయి సుధీర్, స్థానికులు గౌత శేఖర్, అరునార్తి చంద్రశేఖర్, తొడుపునూరి హరినాథ్, పెండ్యాల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.






























