మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విజ్ఞప్తి
ప్రతిపక్షం ప్రతినిధి ఖానాపూర్ నవంబర్ 28: ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మెడంపల్లి సదర్మాట్, మస్కాపూర్, దిలావర్పూర్తో పాటు కడెం మండలంలోని దిల్దార్నగర్,సారంగాపూర్ ప్రాంతాల్లో నూతన పుష్కర ఘాట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల్లో భక్తులకు, స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రతిపాదిత పనులకు త్వరితగతిన నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల పోరం అధ్యక్షులు అపవాత్ రాజేందర్,దిలావర్ పూర్ సర్పంచ్ చింతల మల్లేష్, దొనికెని దయనంద్ ఉన్నారు.


























