ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 29: మెదక్ పట్టణంలోని మంజీరా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు అధ్యక్షతన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రోహిత్ రావు మాట్లాడుతూ, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 99 శాతం పూర్తయిందని తెలిపారు. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, గ్రామస్థాయి కార్యకర్తలు, స్థానిక నాయకత్వం నిరంతర కృషి ఫలితమని ఆయన పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి విజయవంతంగా అమలు చేసిందన్నారు.ఇంకా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయని అర్హులైన ప్రతి ఓటరు వెంటనే తమ వివరాలను పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమైన సహాయం, మార్గదర్శకత్వం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో విశేషంగా శ్రమించిన పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ 278 మంది బీఎల్‌ఏలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.14 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించి అందజేశారు. ఇది వారి సేవలకు గుర్తింపుగా అందిస్తున్న చిన్న కానుక మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అదేవిధంగా తమ తమ మండలాల్లో 100 శాతం ఎస్‌ఐఆర్ పూర్తి చేసిన ఇద్దరు బీఎల్‌ఏలను ప్రత్యేకంగా సన్మానించి, వారి అంకితభావాన్ని అభినందించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే డా. రోహిత్ రావు స్వయంగా ప్రారంభం నుంచి ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ బీఎల్‌ఏలు, మండల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో నిరంతర సమన్వయం కొనసాగించడంతోనే ఈ విజయాన్ని సాధించగలిగామని అన్నారు.
ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. గంగాధర్, పార్టీ ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మిగిలిన ఎస్‌ఐఆర్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.



















