హైదరాబాద్ కమిషనర్ పరిధిలోని పెండింగ్ లైసెన్సులు వెంటనే ఇవ్వాలి.

*గీతా పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి

*గీతా కార్మికులకు కొత్త సొసైటీలు, టీఎఫ్‌టీ లైసెన్సులు తక్షణమే మంజూరు చేయాలి.

*అర్హులైన గీతా కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి – తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

*1000 కోట్ల సంక్షేమ నిధి, నల్లగొండలో తాటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి

*చండూరులో గీతా పనివారల సంఘం 16వ మండల మహాసభ .

ప్రతి పక్షం చండూరు నవంబర్ 03 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కమిషనర్ పరిధిలో పెండింగ్ లో ఉన్న గీతా కార్మికుల నూతన సొసైటీలు, TFT లైసెన్సులను వెంటనే మంజూరు చేయాలని గీతా పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో జరిగిన గీతా పనివారల సంఘం 16వ మండల మహాసభ సమావేశంలో ఆయన మాట్లాడారు.

*ప్రధాన డిమాండ్లు – పబ్బు వీరస్వామి:
_ కొత్తగా దరఖాస్తు చేసుకున్న గీతా కార్మికుల సొసైటీలకు, TFT లైసెన్సులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి.

-పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన గీతా కార్మికులందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలి.
-వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి.

  • తాటి పండ్ల గుజ్జుతో వివిధ ఉత్పత్తులు తయారు చేసేందుకు నల్లగొండ జిల్లాలో ప్రత్యేక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి.
  • రూ. 1000 కోట్లతో గీతా కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి.
  • మరణించిన గీతా కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

*జిల్లా ప్రధాన కార్యదర్శి బొడిగె సైదులు మాట్లాడుతూ..
గీతా కార్మికులకు చెట్లను కేటాయించే సమయంలో చెట్టు యజమానులకు, కార్మికులకు మధ్య వివాదాలు తలెత్తకుండా స్పష్టమైన విధివిధానాలు అమలు చేయాలని సూచించారు. గీతా కార్మికులకు మోపెడ్లు, బైకులు అందించి వృత్తికి అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు.సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య మాట్లాడుతూ గీతా వృత్తిపై ఆధారపడి బతికే ప్రతి గీత కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలని, చండూరు మండలంలో సంఘం బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.గీతా కార్మికుల సంక్షేమం, ఉపాధి భద్రత సమస్యలను ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని నాయకులు కోరారు.
ఈ సమావేశంలో సంఘం జిల్లా సహకారదర్శి పల్లె శంకరయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శులు పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, నాయకులు గంట నగేష్, గండు కేశవులు, బోయపల్లి వెంకటేశం, బొడ్డు ముత్తయ్య, బోయపల్లి బిక్షమయ్య, గునగంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News