మెదక్ పట్టణంలో దొంతి నరేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. ఘనంగా కేక్ కటింగ్
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ నవంబర్ 01: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు అభిమానులు, నాయకులు, కార్యకర్తల కోలాహలం మధ్య ఉత్సాహభరితంగా సాగాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సాయి బాలాజీ గార్డెన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగుతూ రాందాస్ చౌరస్తా వరకు చేరుకుంది. ర్యాలీ పొడవునా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం రాందాస్ చౌరస్తా వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వేడుకల ప్రాంగణం అభిమానుల సందడి, నినాదాలతో పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.































