[t4b-ticker]

ప్రజా పాలనలో పేదలకు లబ్ధి: నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

*కాంగ్రెస్ ప్రజా పాలన పేదల పాలన -నల్గొండలో కాంగ్రెస్ వికాస యాత్ర

*నల్గొండలో 1000 మందితో కాంగ్రెస్ వికాస యాత్ర – BRS పై కైలాష్ ఫైర్

*2029లో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డే – రోజుకు 18 గంటలు పనిచేసే దార్శనికుడు రేవంత్

*1000 రోజుల విజయాలపై నల్గొండలో ఘనంగా వికాస యాత్ర – శివాజీ నగర్ నుండి క్లాక్ టవర్ వరకు 1000 మంది కార్యకర్తలతో ర్యాలీ.

*ప్రజా పాలనలో పేదలకు లబ్ధి – నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత

ప్రతి పక్షం నల్గొండ, సెప్టెంబర్ 04: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో నిరుపేదలకు అన్ని విధాలా లబ్ధి జరుగుతుందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు పున్న కైలాష్ నేత అన్నారు. శుక్రవారం నాడు జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ నుండి క్లాక్ టవర్ వరకు 1000 రోజుల్లో సాధించిన విజయాలపై ఘనంగా వికాస యాత్ర నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి విజయోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదల అభ్యున్నతికై కృషి చేస్తున్నారని, దళిత బహుజనుల ఆత్మీయ బంధువుగా మారారని కొనియాడారు. నిరుపేదలకు సన్న బియ్యం, 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు RTC ఉచిత ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ చీరలు లాంటి అద్భుతమైన పథకాలు దేశానికే ఆదర్శమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల గుండెల్లో నిలిచారని అన్నారు. సాగునీరు, త్రాగునీరు అందించడానికి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్న రైతు బాంధవుడని పేర్కొన్నారు.

రోజుకు 18 గంటలు తెలంగాణ కోసం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి దార్శనికుడని, ఫాంహౌస్ లో పడుకున్న KCR, KTR లు ప్రజా పాలనను విమర్శించడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, నిలువు దోపిడీ చేసిన BRS పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మబోరని, 2029లో మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి అవుతారని పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన దోపిడీ దొంగల ముఠాకు నేడు తెలంగాణలో నిరసనలు తెలిపే నైతిక హక్కు లేదన్నారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ స్వామి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగని మాధవి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ముంతాజ్ అలీ, ప్రధాన కార్యదర్శులు పోసిరెడ్డి సంతోష్ రెడ్డి, మేకల రాజేందర్ రెడ్డి, గోపిశెట్టి రాంబాబు, ఏళ్ల రవీందర్ రెడ్డి, కుకుడాల బాలకృష్ణ, జిల్లా కార్యదర్శులు చర్లపల్లి గౌతమ్, దామనూరి అశోక్, కాసిరెడ్డి నరేష్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, కొండమల్లెపల్లి సర్పంచ్ యుగంధర్ రెడ్డి, చింతమల్ల వెంకటయ్య, కాటం వెంకన్న, INTUC, NSUI, YOUTH CONGRESS నాయకులు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News