*చండూరులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మహిళల ఆందోళన .
*మహిళల హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.
*చండూరులో మహిళల భారీ ధర్నా, వంటా-వార్పు
*1000 రోజుల దగాకోరు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట.
*బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్ ఫైర్.
ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 04: ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రోజులు గడిచినా హామీలను అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పోరుబాట చేపట్టింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు పట్టణంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు భారీ ధర్నా, వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ధర్నాను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను, ముఖ్యంగా మహిళలను దగా చేసిందని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళల హక్కుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, 1000 రోజుల దగాకోరు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.





























