[t4b-ticker]

పాంచజన్య సంకల్ప సభ పోస్టర్ ఆవిష్కరణ

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, సెప్టెంబర్ 15: ఈ నెల 20న ఆదివారం కొడంగల్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్‌ను మెదక్ తెరాస పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ బట్టి అజయ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సభకు సంబంధించిన కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు ఇప్పా రమేశ్, కేవల్ నందకిషోర్, తెరాస వి అధ్యక్షుడు ఎండీ జునైద్, కాసాపురం అశోక్, వేపురి శ్రీనివాస్, తెరాస సోషల్ మీడియా మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైష్ణవ్ రాజ్, దినేశ్, రేహాన్, మల్లేశ్, మోయినుద్దీన్, ప్రేమ్, భూపత్పూర్ రమేశ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News