రాతిలో ఒదిగిన చరిత్రకు మౌన సాక్ష్యాలు
మన మెదక్ – మన చరిత్ర
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 15: చరిత్ర అంటే కేవలం రాజులు, రాజ్యాలు, యుద్ధాల కథలు మాత్రమే కాదు. నాటి సమాజ జీవన విధానాన్ని, కళా వైభవాన్ని, ఆధ్యాత్మిక విశ్వాసాలను మన కళ్లముందు నిలిపే శిల్పాలు కూడా చరిత్రకు సజీవ సాక్ష్యాలే.అలాంటి అపారమైన చారిత్రక సంపదను తనలో దాచుకున్న నేల మెతుకుసీమ. మెదక్ జిల్లా నలుమూలలా కనిపించే పురాతన దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు నాటి నాగరికతకు, శిల్పకారుల అద్భుత నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.ముఖ్యంగా వినాయకుడి పురాతన శిల్పాలు ఈ ప్రాంతపు శిల్పకళా సంప్రదాయానికి ప్రత్యేక అద్దం పడుతున్నాయిని . వివిధ కాలాల్లో స్థానికంగా లభించిన రాతితో చెక్కబడిన ఈ శిల్పాల్లో విగ్రహ రూపకల్పన, అలంకరణ, శరీర నిర్మాణం వంటి అంశాల్లో ఆనాటి శిల్పుల కళాత్మక దృష్టి స్పష్టంగా కనిపిస్తుందిని. మన మెదక్ మన చరిత్ర పరిశోధకుడు బుర్ర సతీష్ తెలిపారు మెదక్ మండలంలో మెదక్ బొగడ భూపతిపూర్. మకరజ్యోతి. తుక్కాపూర్ వివిధ గ్రామాలలో వినాయక విగ్రహాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
కాలం మారింది… పాలకులు మారారు… తరాలు మారాయి. కానీ శిలలో చెక్కిన ఈ చారిత్రక ఆనవాళ్లు మాత్రం నాటి సంస్కృతిని నేటి తరానికి మౌనంగా పరిచయం చేస్తూనే ఉన్నాయి.అయితే అభివృద్ధి, నిర్లక్ష్యం, సంరక్షణ లోపం కారణంగా అనేక పురాతన శిల్పాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మన చరిత్రకు మూలాధారాలైన ఇలాంటి శిల్పాలను గుర్తించడం, వాటి వివరాలను నమోదు చేయడం, సంరక్షించడం అత్యంత అవసరం.మెతుకుసీమ నేలలో దాగి ఉన్న అలాంటి కొన్ని అరుదైన పురాతన వినాయక శిల్పాల చిత్రమాళిక.



































