ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తన ఆప్తమిత్రుడిని, తెలంగాణ ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణనే శ్వాసగా భావించి, నీతి, నిజాయితీతో ప్రజాసేవ చేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి నిలిచారని కేసీఆర్ కొనియాడారు. ఆయన రాజకీయ జీవితం ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు.
పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చిన కేసీఆర్, కుటుంబ సభ్యురాలు పెద్ది స్వప్నకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

















